![]() |
![]() |
.webp)
ప్రస్తుతం 'వార్-2' అనే బాలీవుడ్ ఫిల్మ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఎన్టీఆర్-నీల్ కాంబినేషన్ కావడంతో.. కేవలం ప్రకటనతోనే డ్రాగన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్ మొదలైంది. (NTR Neel)
ఈరోజు(ఫిబ్రవరి 20) నుంచి ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ ప్రారంభమైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక ఫొటోని కూడా విడుదల చేశారు. ఆ పిక్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మైక్ పట్టుకొని ఉన్నాడు. ఆ ఫొటోని చూస్తుంటే.. వందల మంది జనాభా నిరసన తెలుపుతున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు అర్థమవుతోంది. అలాగే పోలీస్ వెహికిల్స్ కూడా కనిపిస్తున్నాయి. (Dragon)

రామోజీ ఫిల్మ్ సిటీలో 'డ్రాగన్' షూటింగ్ మొదలైంది. పది రోజుల పాటు జరగనున్న మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనట్లేదని తెలుస్తోంది. దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు మరియు కొందరు ఇతర నటీనటులతో.. ఎన్టీఆర్ లేని సన్నివేశాలను తొలుత చిత్రీకరించనున్నారట. మార్చిలో జరగనున్న రెండో షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ పాల్గొంటాడని సమాచారం.
డ్రాగన్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. టోవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు వినికిడి. ఈ సినిమా 2026, జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |