![]() |
![]() |
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ప్రస్తుతం సినిమాల్లోను,రాజకీయాల్లోను బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒక వైపు సినిమా షూటింగ్ లో పాల్గొంటునే,మరో వైపు ఉప ముఖ్యమంత్రి హోదాలో తాను నిర్దేశించుకున్న రాజకీయ లక్ష్యాల కోసం పని చేస్తు వస్తున్నాడు.రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని 'ప్రయాగ్ రాజ్'(Prayagaraj)లో జరుగుతున్న 'మహాకుంభమేళా'(Mahakumbamela)లో కుటుంబసమేతంగా పాల్గొనగా అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
పవన్ రీసెంట్ గా ఢిల్లీలో 'బిజెపీ'(Bjp)తరుపున ముఖ్యమంత్రిగా 'రేఖాగుప్తా'(Rekha Gupta)ప్రమాణ స్వీకారం చేస్తుంటే, ఆ కార్యక్రమానికి వెళ్లడం జరిగింది.స్టేజ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)తో పాటు,ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు,డిప్యూటీ సిఏం లు కూడా ఉన్నారు.ఇక ముఖ్య అతిధిగా వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)స్టేజి కి పైకొచ్చి ఒక్కొక్కరిని పలకరిస్తు పవన్ ని కూడా పలకరించాడు.పవన్ కాషాయ వస్త్రాలతో ఉండటంతో 'ఏంటి హిమాలయాలకి వెళ్తావా అని మోడీ అడగటం జరిగింది.దీంతో పవన్ కూడా మోదీతో హిమాలయాలకి వెళ్ళడానికి టైం ఉందని చెప్పాడు.ఈ విషయాన్నీ పవన్ ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో కూడా చెప్పడం జరిగింది.
ఇక పవన్ నోటి వెంట హిమాలయలకి వెళ్తాననే మాటలు రావడంతో పవన్ ఫ్యాన్స్ లో సరికొత్త ఆలోచనలకి తెరదీస్తున్నాయి.పవన్ చేతిలో ప్రస్తుతం హరిహరవీరమల్లు(Hari Hara Veeramallu)ఓజి(og),ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి.వీటిల్లో 'హరిహరవీరమల్లు' కి పవన్ ఇంకో నాలుగు రోజులు డేట్స్ ఇస్తే సినిమా కంప్లీట్ అవుతుందని మేకర్స్ చెప్తున్నారు.మార్చి 28 న వీరమల్లు వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.
![]() |
![]() |