![]() |
![]() |

ప్రముఖ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen)ఫిబ్రవరి 14 న 'లైలా'(Laila)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.మొదటి సారి విశ్వక్ లేడీ గెటప్ ని పోషించడంతో పాటు,ప్రచార చిత్రాలు కూడా కొత్తగా ఉండటంతో 'లైలా' పై విశ్వక్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.కానీ సినిమా ప్లాప్ గా నిలవడంతో పాటు,కొన్ని అసభ్యకర సన్నివేశాలు, అసభ్య డైలాగ్స్ పై ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది.
ఈ విషయంపై రీసెంట్ గా విశ్వక్ సేన్ తన అభిమానులని, ప్రేక్షకులని ఉద్దేశించి ఒక నోట్ ని విడుదల చేసాడు.'నా చివరి సినిమాకి వస్తున్న విమర్శలు కరెక్టే.ఇక నుంచి అలాంటి సినిమాలు చెయ్యను.ఒక చెడ్డ సినిమా తెస్తే నన్ను నిలదీసే అధికారం మీకు ఉంది.నా సినిమాకి సంబంధించిన ప్రతి సన్నివేశం,మీ మనసుకు నచ్చని విధంగా ఉండకూడదని నిర్ణయించుకున్నాను.నేను చేసే ప్రతి సినిమాకి ఇన్ స్ప్రెషన్ మీరే.మీ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను.నా ప్రయాణంలో ఎవరు లేనప్పుడు నా వెనుక ఉంది కూడా మీరే.అందుకే సీన్స్, డైలాగ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాను.
నా పై విశ్వాసం ఉంచిన నా ప్రొడ్యూసర్స్,దిష్ట్రుబ్యూటర్స్ అందరకి కృతజ్ఞతలు,దర్శకులు రచయితలతో పాటు నన్ను మలిచిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. త్వరలోనే ఒక మంచి కథతో మీ ముందుకు వస్తాను.మీ మద్దతు నాకెంతో ముఖ్యమని తెలిపాడు.విశ్వక్ చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు ఉన్నాయి.
.webp)
![]() |
![]() |