![]() |
![]() |

డార్లింగ్,యుగానికి ఒక్కడు,ఎందుకంటేప్రేమంట,ఆకాశమే నీ హద్దురా,రాజారాణి,మట్కా,తంగలాన్ ఇలా ఎన్నో సినిమాలకి హిట్ మ్యూజిక్ ని అందించిన సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్(Gv Prakash Kumar)రీసెంట్ గా అమరన్(Amaran)లక్కీ భాస్కర్(Lucky Bhasakar)వంటి సినిమాలకి కూడా సంగీతాన్ని అందించి,ఆ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాడు.మరో పక్క హీరోగా కూడా నటిస్తు తనదైన శైలిలో ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నాడు.
ఈ కోవలోనే మార్చి 7 న 'కింగ్ స్టన్'(King Ston)అనే ఫాంటసీ హర్రర్ జోనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.దివ్య భారతి(Divya Bharathi)హీరోయిన్ గా చేస్తుంది.ఈ జంట ఇంతకు ముందు 'బ్యాచిలర్' అనే సినిమాలో నటించి హిట్ ఫెయిర్ అనిపించుకుంది.రీసెంట్ గా 'కింగ్ స్టన్' ప్రమోషన్స్ లో భాగంగా దివ్యభారతి మాట్లాడుతు జి వి ప్రకాష్ కుమార్ ఆయన భార్య సైంధవి(Saindhavi)విడాకులకు కారణం నేనే అని చాలా విమర్శలు వచ్చాయి.బ్యాచిలర్ సినిమాలో ప్రకాష్,నా మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది.దీంతో మేమిద్దరం రిలేషన్ లో ఉన్నామని,అందుకే ప్రకాష్ ఆయన భార్యకి విడాకులు ఇచ్చాడని చాలా దారుణంగా తిడుతూ మెసేజెస్ వచ్చాయి.అలా తిడుతు మెసేజెస్ చేసిన వారిలో ఆడవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు.వాటిని నేను ప్రకాష్ కి చూపిస్తే అవన్నీ ఏం పట్టించుకోకు,కెరీర్ పై దృష్టి పెట్టమని చెప్పాడు.ప్రకాష్ నేను చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది.
ప్రకాష్ కూడా ఈ విషయంపై మాట్లాడుతు దివ్యతో నేను పలు ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చేశాను.మా మధ్య మంచి స్నేహ బంధం ఉంది,అతను మించి ఎలాంటి రిలేషన్ లేదు. ప్రేక్షకులని ఎంటర్ టైన్ చెయ్యడానికే సినిమాల్లోకి వచ్చానని తెలిపాడు.ఇక ప్రకాష్, సైంధవి స్కూల్ డేస్ నుంచే ప్రేమించుకొని 2013 లో వివాహం చేసుకున్నారు.పరస్పర అభిప్రాయ బేధాలతో గత ఏడాది విడాకులు తీసుకోవడం జరిగింది.సైంధవి గాయనిగా తమిళ చిత్ర సీమలో సుమారు 150 కి పైగా పాటలు పాడింది.విడాకులు తీసుకున్న తర్వాత సైంధవి, ప్రకాష్ ఒక కాన్సర్ట్ ని కూడా నిర్వహించారు.

![]() |
![]() |