![]() |
![]() |

రక్తచరిత్ర,లెజండ్(Lejend)లయన్ వంటి చిత్రాల్లో అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటి 'రాధికా ఆప్టే'(Radhika Apte).బెంగాలీ,మరాఠీ, హిందీ,ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా చేసి నటనలో తనకి తిరుగులేదని అనిపించుకుంది.ఒక్క హిందీలోనే ఇప్పటికి వరకు సుమారు ముప్పై చిత్రాల దాకా నటించిందంటే రాధికా ఆప్టే హవాని అర్ధం చేసుకోవచ్చు.ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే బ్రిటిష్ వయోలిస్ట్ బెనెడిక్ట్ టేలర్ తో కొన్నేళ్ల పాటు సహజీవనం చేసి 2012 లో వివాహం చేసుకుంది. ఆ ఇద్దరకీ ప్రస్తుతం సంవత్సరంలోపు ఉన్న ఒక బేబీ ఉంది.
రాధికా ఆప్టే రీసెంట్ గా బ్రెస్ట్ మిల్క్ పంపింగ్ చేస్తునే, ఆల్కహాల్ గ్లాస్ పట్టుకొని ఉన్న పిక్ ని ఇనిస్టాగ్రమ్ లో షేర్ చేసింది.దీంతో పలువురు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా రాధికా తీరుని తప్పుబడుతు'బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.కానీ రాధిక ఆప్టే బేబీ ఫీడింగ్ చేస్తూ షాంపెయిన్ తాగడం ఎంత వరకు కరెక్ట్, బేబీ ఆరోగ్యం పాడవుతుందంటు కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పుడనే కాదు గతంలోను రాధికా ఆప్టే చేసిన పనుల మీద చాలా విమర్శలు వచ్చాయి.గత ఏడాది సిస్టర్ మిడ్ నైట్, మెర్రి క్రిస్మస్ అనే చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన రాధికా ప్రస్తుతం 'లాస్ట్ డేస్' అనే అమెరికన్ ఇంగ్లీష్ సినిమా చేస్తుండగా ఈ ఏడాదే ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |