![]() |
![]() |

డైరెక్టర్ శంకర్ సినిమాలంటే ఒక రేంజ్ లో ఉంటాయి. దాదాపు ఆయన అన్ని మూవీస్ కూడా హిట్టే. ఇక ఇప్పుడు ఆయన కూతురు హీరోయిన్ గా ఎదిగింది. అది కూడా బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన హీరోయిన్ గా డైరెక్టర్ శంకర్ కూతురు అదితి చేస్తోంది. ఆ మూవీ పేరు 'భైరవం'. ఇప్పుడు ఈ మూవీ టీమ్ అంతా కూడా సుమా అడ్డా షోకి ఎంట్రీ ఇచ్చింది. "భైరవం" మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అదితి శంకర్‌కి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది సుమ.
ఇక ఈ షోలో హీరోయిన్ కి కొన్ని పిక్స్ చూపించింది. మహేష్ బాబు పిక్ చూపించేసరికి "కుర్చీ మడతపెట్టి" అంటూ స్టెప్ వేసింది. ఇక రామ్ చరణ్ పిక్ చూపించేసరికి సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది. "నేను ఆయనకు బిగ్ ఫ్యాన్ ని. ఆయనంటే చాల ప్రేమ కూడా" అని సిగ్గుతో చెప్పింది. ఇక అతిధి నటిగా, నిర్మాతగా, గాయినిగాను చాలా ఫేమస్. ఈ బ్యూటీ తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరో కార్తీ నటించిన తమిళ చిత్రం "విరుమాన్" అనే మూవీ ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అదితి. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ ని అందుకుంది ఈ అమ్మడు. శివకార్తికేయన్ హీరోగా నటించిన మహావీరన్ సినిమాలోనూ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమానే తెలుగులో మహావీరుడుగా రిలీజ్ అయ్యింది. ఇక భైరవం మూవీలో డైరెక్టర్ శంకర్ కూతురు అదితి ఎలా నటిస్తుందో చూడాలి.
![]() |
![]() |