![]() |
![]() |

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా 'VD12'. ఈ సినిమాకి 'కింగ్‌డమ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అలాగే టీజర్ ను కూడా విడుదల చేశారు. (KINGDOM)
'కింగ్‌డమ్' టీజర్ తెలుగు వెర్షన్‌కి జూనియర్ ఎన్టీఆర్, తమిళ వెర్షన్‌కి సూర్య, హిందీ వెర్షన్‌కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు. ఎన్టీఆర్ వాయిస్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తెలిసిందే. "అలసట లేని భీకర యుద్ధం. అలలుగా పారే ఏరుల రక్తం." అంటూ తన పవర్ ఫుల్ వాయిస్ తో టీజర్ ని మరోస్థాయికి తీసుకెళ్లాడు ఎన్టీఆర్.
'కింగ్‌డమ్' టీజర్ అదిరిపోయింది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడేసే ఎమోషన్స్ తో ఈ సినిమా భారీస్థాయిలో రూపొందుతోందని టీజర్ తో స్పష్టం చేశారు. విజయ్ సరికొత్త అవతార్ లో కనిపిస్తున్నాడు. టీజర్ లో విజువల్స్ హైలైట్ గా నిలిచాయి. అనిరుధ్ బీజీఎం కూడా ఆకట్టుకుంది.
ఇక ఈ మూవీ కొత్త విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. మార్చి 28న విడుదల కావాల్సిన ఈ సినిమా, మే 30 కి వాయిదా పడినట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తూ.. ఈ చిత్రాన్ని మే 30న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

![]() |
![]() |