![]() |
![]() |

ప్రముఖ సినీ నటుడు 30 ఇయర్స్ పృథ్వీ(Prudhvi)ఇటీవల జరిగిన 'లైలా'(Laila)మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గొర్రెల లెక్కల గురించి చెప్తూ 150 ,11 అనే అంకెల ప్రస్తావన తీసుకొచ్చిన విషయం తెలిసిందే.దీంతో పృథ్వీ మాటలు ఏపి కి చెందిన వైసిపీ పార్టీని ఉద్దేశించి చేసినవని,ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తనపై అత్యంత దారుణంగా పోస్ట్ లు చెయ్యడంతో పాటుగా, పర్సనల్ ఫోన్ నెంబర్ కి కూడా ఫోన్ చేసి,సభ్య సమాజం తలదించుకునేలా అసభ్య పదజాలంతో దూషించారని పృథ్వీ చెప్పడం జరిగింది.
దీంతో తనని వేధిస్తున్న వాళ్ళందరి ఫోన్ నంబర్స్ లిస్ట్ తో పృథ్వీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులని కలిసి ఫిర్యాదు చెయ్యడం జరిగింది.ఫిర్యాదు చేసిన సమయంలో పృథ్వీ కుటుంబ సభ్యులు కూడా ఆయన వెంట ఉన్నారు.అంతకు ముందు వైసిపీ సోషల్ మీడియా చేసే అనాగరిక చర్యలకి తట్టులేక బిపీ పెరగడంతో పృథ్వీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.ఆ తర్వాత కోలుకున్న పృథ్వీ మీడియాతో కూడా మాట్లాడుతు వైసిపీ వాళ్ళు చనిపోయిన తన తల్లిని కూడా తిట్టారని తన ఆవేదనని వెల్లడి చెయ్యడం జరిగింది.

![]() |
![]() |