![]() |
![]() |
.webp)
బాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరైన 'సైఫ్ అలీఖాన్'(Saif Alikhan)పై ఇటీవల ఒక దుండగుడు జరిపిన దాడి ఎంత పెద్ద సంచలనమయ్యిందో తెలిసిందే.మహానగరమైన 'ముంబై' లో,అది కూడా 'బాంద్రా'లాంటి ఖరీదైన ఏరియాలో 'సైఫ్ అలీ ఖాన్' లాంటి స్టార్ ఇంటికి సెక్యూరిటీ ఎందుకు లేదనే చర్చ కూడా జరిగింది.
ఇప్పుడు ఈ విషయంపై రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు,దర్శక,నిర్మాత 'ఆకాష్ దీప్ సబీర్'(Akashdeep Sabir)ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు కరీనా కపూర్ 21 కోట్ల రూపాయిల రెమ్యునరేషన్ తీసుకుంటున్నా కూడా ఇంటి ముందు ఫుల్ టైం సెక్యూరిటీ ని నియమించుకోలేకపోయింది.అల్లు అర్జున్(Allu Arjun)పుష్ప(Pushpa)కి 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు కరీనా కపూర్ కూడా 100 కోట్లు ఇస్తే అప్పుడు సెక్యూరిటీ ని,డ్రైవర్ ని నియమించుకుంటారేమో.
కరీనా చిన్నపిల్లపట్నుంచి నాకు తెలుసు.ఆమె మొదటి సినిమాకి నేను దర్శక నిర్మాతగా వ్యవహరించాను.సైఫ్ మీద దాడి జరిగినపుడు వాళ్ళకి సపోర్ట్ గా చాలా మీటింగ్స్ లో మాట్లాడాను.కాకపోతే ఫుల్ టైం సెక్యూరిటీ,ఫుల్ టైం డ్రైవర్ లు వాళ్ళకి ఎందుకు లేరు అని చాలా మంది అడిగితే వాటికి నా దగ్గర సమాధానాలు లేకుండా పోయాయని చెప్పుకొచ్చాడు.
.webp)
![]() |
![]() |