![]() |
![]() |
.webp)
యువసామ్రాట్ నాగ చైతన్య(naga chaitanya)సాయిపల్లవి(Sai Pallavi)జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ 'తండేల్'(Thandel)ఈ నెల 7 న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న విషయం తెలిసిందే.ఆడియో హిట్ కావడంతో పాటు ట్రైలర్,ప్రచార చిత్రాలు కూడా ఒక రేంజ్ లో ఉండటంతో 'తండేల్' పై అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.
ఇక ఈ మూవీని అగ్ర నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడు ఈ సంస్థ నుంచి 'తండేల్' ని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి కొన్ని సూచనలు వెళ్లినట్టుగా ఫిలిం సర్కిల్స్ లో కథనాలు వినిపిస్తున్నాయి. సినిమా బాగా వచ్చిందని, ఎవరు కూడా మినిమమ్ గ్యారంటీ కింద పట్టణాలు,థియేటర్స్ లెక్కన ఎగ్గిబ్యూటర్స్ కి ఇచ్చి ఆదాయాన్ని లిమిట్ చేసుకోవద్దని సూచన చేసినట్టుగా తెలుస్తుంది.దీంతో నిర్మాతల నిర్ణయంతో 'తండేల్' రెంట్ బేసిస్ తో రిలీజ్ అవుతుందనే మాటలు కూడా వినపడుతున్నాయి.
ఇక 'తండేల్' ని 'కార్తికేయ 2 ' తో పాన్ ఇండియా లెవల్లో హిట్ ని అందుకున్న చందు మొండేటి(Chandu Mondeti)దర్సకత్వం వహిస్తుండగా,దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతాన్ని అందించాడు.ఆడు కాలం నరేన్, కరుణాకరన్,దివ్య పిళ్ళై తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తండేల్ రూపొందింది.
![]() |
![]() |