![]() |
![]() |

ప్రముఖ నిర్మాత కృష్ణప్రసాద్ చౌదరి (కె.పి చౌదరి) ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కె.పి చౌదరి, గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం పోలీసులు వెళ్లి చూసేసరికి ఆయన విగతజీవిగా కనిపించారు. దీంతో పోలీసులు ఆత్మహత్య కేసు నమోదు చేశారు. (KP Chowdary)
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి సినిమాను తెలుగులో విడుదల చేశారు కె.పి. అలాగే పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. నిర్మాతగా అంతగా కలిసి రాకపోవడంతో గోవాలో ఒక పబ్ ను స్టార్ట్ చేశారు. అయితే ఆ వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం గోవాలో ఉంటున్న ఆయన ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు.
![]() |
![]() |