![]() |
![]() |

కొంతకాలంగా అల్లు అర్జున్ పేరు న్యూస్ లో మారుమోగిపోతోంది. ఓ వైపు 'పుష్ప-2' భారీ విజయం, మరోవైపు పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో.. ఈమధ్య అల్లు అర్జున్ పేరు తరచూ వార్తల్లో వినిపించింది. ఇక ఇప్పుడు 'తండేల్' ఈవెంట్ పుణ్యమా అని.. బన్నీ పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. (Allu Arjun)
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'తండేల్' (Thandel). గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ హాజరవుతారని మేకర్స్ ప్రకటించారు. కానీ బన్నీ మాత్రం ఈవెంట్ కి రాలేదు. పైగా ఈ విషయాన్ని చివరి నిమిషం వరకు చెప్పలేదు. రీసెంట్ గా విదేశాలకు వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ గ్యాస్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడని, అందుకే ఈవెంట్ కి రాలేకపోయాడని.. అల్లు అరవింద్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. అయితే బన్నీ నిజంగానే గ్యాస్ సమస్యతోనే ఈవెంట్ కి రాలేదా? లేక మరేదైనా కారణముందా? అనే చర్చలు జరుగుతున్నాయి.
తండేల్ ఈవెంట్ కి అల్లు అర్జున్ రాకపోవడానికి.. సంధ్య థియేటర్ ఘటన కారణమని తెలుస్తోంది. పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. రెండు నెలల నుంచి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. కానీ ఇంతవరకు సాధారణ స్థితికి రాలేదు. ఈ క్రమంలో కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను.. అల్లు అర్జున్ సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాసు తాజాగా పరామర్శించారు. వైద్యులను అడిగి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అలాగే శ్రీతేజ్ కు మెరుగైన వైద్యం అందించడానికి ఫారెన్ తీసుకెళ్లాలని బన్నీ అండ్ టీం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికీ సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ ని వెంటాడుతూనే ఉంది. రెండు నెలలైనా శ్రీతేజ్ ఇంకా కోలుకోలేదు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో తాను సినిమా వేడుకకు హాజరైతే, ప్రజల్లోకి మళ్ళీ తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో.. తండేల్ ఈవెంట్ కి హాజరు కాకూడదని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ విషయాన్ని వేదికపై ప్రస్తావించడం కరెక్ట్ కాదని భావించిన అల్లు అరవింద్.. ఇలా గ్యాస్ సమస్య అని కవర్ చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది.
![]() |
![]() |