![]() |
![]() |

మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి బిగ్ స్టార్స్ తో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి యంగ్ హీరోలు ఉన్నారు. మెగా హీరోల నుంచి ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలు వస్తుంటాయి. వాటిలో ఒకటి కాకపోతే మరొకటి హిట్ అవుతుంటాయి. కానీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన గత ఏడు సినిమాలను గమనిస్తే, అన్నీ ఘోర పరాజయం పాలయ్యాయి. పైగా ఆ ఏడు సినిమాల్లో మూడు సినిమాలు వరుణ్ తేజ్ వే కావడం గమనార్హం.
2023 ప్రారంభంలో మెగా ఫ్యామిలీకి బాగానే కలిసొచ్చింది. జనవరిలో 'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవి (Chiranjeevi) బ్లాక్ బస్టర్ అందుకుంటే, ఏప్రిల్ లో 'విరూపాక్ష'తో సాయి ధరమ్ తేజ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత నుంచి వరుసగా డిజాస్టర్స్ ఎదురయ్యాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి తేజ్ కలిసి నటించిన 'బ్రో' మూవీ 2023 జులైలో విడుదలై, దాదాపు 70 శాతం రికవర్ సాధించి ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐదు సినిమాలు కనీసం 40 శాతం కూడా రికవర్ సాధించలేకపోయాయి. 2023 ఆగష్టులో చిరంజీవి 'భోళాశంకర్', వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున', నవంబర్ లో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' విడుదల కాగా.. మూడూ పరాజయం పాలయ్యాయి. 2024 లో మెగా హీరోలలో వరుణ్ తేజ్ నటించిన సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మార్చిలో 'ఆపరేషన్ వాలెంటైన్', నవంబర్ లో 'మట్కా' రిలీజ్ కాగా.. రెండూ డిజాస్టర్స్ అయ్యాయి. ఇలా 2023లో నాలుగు, 2024లో రెండు పరాజయాలను చూసింది మెగా ఫ్యామిలీ. అంతేకాదు 2025 ను కూడా ఫ్లాప్ తోనే ప్రారంభించింది. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలై, దాదాపు 50 శాతం రికవర్ సాధించి, ఫ్లాప్ దిశగా పయనిస్తోంది. దీంతో మెగా ఫ్యామిలీ వరుసగా ఏడు ఫ్లాప్స్ ని చూసినట్లయింది.
ఈ వరుస పరాజయాలతో మెగా అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ ఏడాది 'విశ్వంభర'తో చిరంజీవి, 'హరి హర వీరమల్లు'తో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాలతోనైనా మెగా ఫ్యామిలీ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
![]() |
![]() |