![]() |
![]() |
శ్రీవెంకటసాయి బ్యానర్‌పై శెట్టిపల్లి శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘షూటర్’. రవిబాబు, ఏస్తర్, ఆమని, రాశి, సుమన్ కీలకపాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 22న భారీ స్థాయిలో వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు
ఈ సందర్భంగా దర్శక నిర్మాత శెట్టిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ‘విభిన్న కథా కథనాలతో షూటర్‌ని తెరకెక్కించాము. ప్రతి ఫ్రేమ్ కూడా ఆర్టిస్టులతో అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో ఈ సినిమా రూపొందించాం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 22న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఫిబ్రవరి 22న భారీ స్థాయిలో వరల్డ్ వైడ్‌గా శ్రీలక్ష్మీ పిక్చర్స్ బాపిరాజు ద్వారా రిలీజ్ కానుంది.
రవిబాబు, సుమన్, ఎస్తార్, ఆమని, రాశి,, అన్నపూర్ణ, సత్య ప్రకాష్, సమీర్, జీవా, ఛత్రపతి శేఖర్, జబర్దస్త్ మహేష్, ఘర్షణ శ్రీనివాస్ తదితరులు నటించారు. స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే: పాయసం ధనుంజయ, సంగీతం: డ్రమ్స్ రాంబాబు, రీరికార్డింగ్: రాజు, సినిమాటోగ్రఫీ: డి.యాదగిరి, నిర్మాత, దర్శకత్వం: శెట్టిపల్లి శ్రీనివాసులు
![]() |
![]() |