![]() |
![]() |

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ (Balakrishna)వన్ మాన్ షో 'డాకు మహారాజ్'(Daku Maharaj)ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్నవిషయం తెలిసిందే.వంద కోట్ల క్లబ్ లో కూడా చేరిన ఈ మూవీలో బాలకృష్ణ సరసన ప్రగ్య జైస్వాల్ జత కట్టగా మరో హీరోయిన్ శ్రద్ద శ్రీనాధ్ కీలకపాత్రలో కనిపించింది.వాల్తేరు వీరయ్యలో చిరంజీవి(Chiranjeevi)తో డాన్స్ చేసిన ఊర్వశి రౌతేలా(Urvashi rautela)కూడా ప్రాధాన్యత గల క్యారక్టర్ లో కనిపించడంతో పాటు'దబిడి దబిడి' సాంగ్ లో బాలయ్యతో కలిసి చిందులేసింది.
ఊర్వశి రౌతేలా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరగటం చాలా దురదృష్టకరం అంటూనే తన చేతికి ఉన్నవజ్రపు ఉంగరాన్ని చూపించింది.దీంతో ఆమె అలా ప్రవర్తించడంపై విమర్శలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఊర్వశి రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు సైఫ్ సర్ మీ గురించి మాట్లాడే సమయంలో నేను ప్రవర్థించిన తీరుకి సిగ్గుపడుతున్నాను.ఈ విషయంలో మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను.ఆ ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో మీ పై జరిగిన దాడి తీవ్రత తెలియదు.గత కొన్ని రోజుల నుంచి డాకు మహారాజ్ విజయోత్సవంలో ఉన్నాను.దీంతో ఇంటర్వ్యూ లో ఆ సినిమా వల్ల నాకొచ్చిన బహుమతులు గురించి మాట్లాడనంతే. దాడి సమయంలో మీ దైర్యానికి హాట్స్ ఆఫ్.మీ పై గౌరవం మరింత పెరిగిందని ఇనిస్టా వేదికగా చెప్పుకొచ్చింది.

ఉత్తరా ఖండ్ కి చెందిన ఊర్వశి రౌతేలా 2015 మిస్ దివా గా నిలిచి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.2013 లో సింగ్ సాబ్ ది గ్రేట్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి పలు హిందీ సినిమాలతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించడం జరిగింది.
![]() |
![]() |