![]() |
![]() |

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)నటించిన 'డాకు మహారాజ్'(Daku Maharaj)సక్సస్ మీట్ నిన్న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా డాకు మహారాజ్ కి మ్యూజిక్ ని అందించిన తమన్(Thaman)మాట్లాడుతూ నేను తమిళ,కన్నడ,హిందీ,మలయాళ భాషలకి వెళ్ళినప్పుడు చాలా మంది తెలుగులో మంచి సినిమా ఒకటి చెయ్యాలి,హీరో చెప్పండి అని అడుగుతున్నారు,కానీ మనం ఇక్కడ నెగిటివ్ ని స్ప్రెడ్ చేసి మన సినిమాని మనమే చంపుకుంటున్నాం.ఏం బతుకులు మనవి అని చెప్పడం జరిగింది.
ఇప్పుడు ఈ మాటలపై చిరంజీవి(Chiranjeevi)సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి.ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంతగా కలత చెందితేనే నువ్వింతగా స్పందించావో.విషయం సినిమా అయినా క్రికెట్ అయినా,మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, వర్డ్స్ కెన్ ఇన్ స్పైర్ అండ్ వర్డ్స్ కెన్ డిస్ట్రాయ్ చూజ్ వాట్ యు విష్ టూ డు.మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చెయ్యడం జరిగింది.
![]() |
![]() |