![]() |
![]() |
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిన కేసులో పుష్ప2 హీరో అల్లు అర్జున్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్‌తో మంచు మోహన్‌బాబు అలెర్ట్ అయ్యారు. ఎందుకంటే రెండు రోజుల క్రితం మోహన్‌బాబు కుటుంబంలో జరిగిన గొడవలో ఒక టీవీ ఛానల్ రిపోర్ట్‌ను మోహన్‌బాబు గాయపరిచారు. దీనికి సంబంధించిన ఆయనపై కేసు నమోదైంది. అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో తన విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉందని భావించిన మోహన్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ వేశారు. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
![]() |
![]() |