![]() |
![]() |

‘పుష్ప2’ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో వేసిన ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ఇప్పటికీ అపస్మారక స్థితిలో ఉండడం అందరికీ తెలిసిందే. ఈ ఘటన పెద్ద సంచలనం సృష్టించింది. ఒక నిండు ప్రాణం పోవడానికి అల్లు అర్జునే కారణమని, అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని పలు సంస్థలు డిమాండ్ చేశాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అల్లు అర్జున్‌పై, థియేటర్ యాజమాన్యంపై, అల్లు అర్జున్ బౌన్సర్లపైన కూడా కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన నోటీసులు కూడా వారికి పంపారు.
ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో అల్లు అర్జున్‌ని అదుపులోకి తీసుకొని పోలీస్ వాహనంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అయితే అతన్ని తీసుకెళ్తున్న సమయంలో అల్లు అర్జున్‌తోపాటు తను కూడా వెళ్లాలని పోలీస్ కారులో కూర్చున్నారు అల్లు అరవింద్. అయితే పోలీసులు దాన్ని సున్నితంగా తిరస్కరించారు. అల్లు అర్జున్ ఒక్కరే తమతో రావాలని తెలిపారు. దీంతో ఆయన కారు నుంచి దిగిపోయారు. ముందుగా అల్లు అర్జున్‌ని పోలీస్ స్టేషన్‌కి తరలించి ఆ తర్వాత కోర్టులో హాజరు పరుస్తారని తెలుస్తోంది.
![]() |
![]() |