![]() |
![]() |
‘పుష్ప2’ బెనిఫిట్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. ఈ కేసులో అల్లు అర్జున్‌పై 105, 118(1), రెడ్ విత్ 3/5 బిఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105 సెక్షన్ నాన్‌బెయిలబుట్ కేసులో 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే బిఎన్‌ఎస్ 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్‌ని పోలీస్ స్టేషన్‌కి తరలించిన పోలీసులు తదుపరి అతన్ని కోర్టు ముందు హాజరు పరుస్తారా లేక పోలీస్ స్టేషన్‌లోనే స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకొని పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
![]() |
![]() |