![]() |
![]() |

మంచు కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. మంచు మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
తండ్రి తనని కొట్టాడంటూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబుపై మనోజ్ ఫిర్యాదు చేశాడు. గాయాలతో పోలీస్ స్టేషన్ కి వచ్చిన మనోజ్.. తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు కూడా తన కుమారుడిపై ఫిర్యాదు చేయడం విశేషం. ఇలా తండ్రీకొడుకుల పరస్పర ఫిర్యాదులు సంచలనంగా మారాయి. ఆస్తుల వ్యవహారమే ఈ గొడవకు కారణమని సమాచారం.
అయితే మోహన్ బాబు పీఆర్ టీం మాత్రం ఈ వార్తలను ఖండించింది. మోహన్ బాబు, మనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం లేదని తెలిపింది. మరి ఈ వార్తలపై మనోజ్ స్పందన ఏంటనేది తెలియాల్సి ఉంది. మనోజ్ కూడా ఈ వార్తలను ఖండిస్తాడో లేక దాడి నిజమేనని చెప్తాడో చూడాలి.
కాగా, గతంలో సోదరులు విష్ణు, మనోజ్ మధ్య కూడా ఇటువంటి ఘటనే జరిగింది. విష్ణు తన వాళ్లపై దాడి చేయడానికి వచ్చాడంటూ మనోజ్ చెప్పినట్టుగా ఉన్న వీడియో ఒకటి అప్పట్లో వైరల్ అయింది.
![]() |
![]() |