![]() |
![]() |

సుమారు రెండు వందల సినిమాలకి పైగా మలయాళ చిత్రసీమలో నటించి అశేష ప్రేక్షాభిమానాన్ని పొందిన నటుడు సిద్దిఖీ(siddique)తెలుగులో కూడా 2013 లో వచ్చిన 'నా బంగారు తల్లి' అనే మూవీలోప్రధాన పాత్ర పోషించి ఆ చిత్ర విజయంలో తను కూడా ఒక భాగస్వామి అయ్యాడు. ఆ మూవీకి నేషనల్ అవార్డ్ తో పాటు పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ లు కూడా రాగా,సిద్దిఖీ అగ్ని నక్షత్రం అనే మరో తెలుగు మూవీతో పాటు పలు తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించి తన సత్తా చాటాడు.
కొన్ని నెలల క్రితం మలయాళ ఇండస్ట్రీ లో నటీమణులు ఎదుర్కుంటున్న లైంగిక సమస్యలపై అక్కడి ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ముందుకొచ్చి ఎంతో మంది నటీమణులు తాము ఎదురుకున్న సంఘటనల గురించి చెప్తున్నారు. ఈ క్రమంలోనే రేవతి సంపత్ అనే నటీమణి హేమ కమిటీ తో సిద్దిఖీ 2016 లో తిరువనంతపురం లోని ఒక హోటల్ లో తనపై అత్యాచారం చేసాడని కొన్ని రోజుల క్రితం హేమ కమిటీకి చెప్పడంతో సిద్దిఖీ శుక్రవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరయ్యాడు.నవంబర్ లో ఇచ్చిన బెయిల్ గడువు కూడా ముగియడంతో సిద్దిఖీ ని అరెస్ట్ చెయ్యడం జరిగింది. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచగా వెంటనే బెయిల్ వచ్చింది.ఈ ప్రాసెస్ అంత గంటల్లోనే జరగడం గమనార్హం.
ఇక తన విషయంలో రేవతి చెప్పేవన్నీ అబద్హాలే అని, తన గౌరవ మర్యాదలకి భంగం కలిగించడానికే రేవతి ఆ విధంగా ప్రవర్తిస్తుందని సిద్దిఖీ డిజీపీకి ఫిర్యాదు చెయ్యడం కూడా జరిగింది.
![]() |
![]() |