![]() |
![]() |

తమిళనాడులో ఉన్న తెలుగు వారి వృత్తి గురించి ప్రముఖ సినీ నటి కస్తూరి(kasthuri)కొన్ని రోజుల క్రితం అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఆమె మాటల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.చెన్నై,మదురై, తేని వంటి జిల్లాల్లో అయితే ఆమెపై కేసులు కూడా నమోదు అయ్యాయి.
దీంతో అరెస్ట్ భయంతో కస్తూరి ముందస్తు బెయిల్ కోరుతూ మదురై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కేసు ని పూర్తిగా పరిశీలించిన న్యాయమూర్తి కస్తూరి మాటల గురించి ప్రస్దావిస్తూ 'కస్తూరి వ్యాఖ్యలు ముమ్మాటికీ హింసను ప్రేరేపించేవిలా ఉన్నాయి.వాక్ స్వాతంత్య్రం అనేది వ్యక్తులు తమ ఆలోచనలు, నమ్మకాలు, అభిప్రాయాలను వ్యక్తపరచడానికి రాజ్యంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కానీ ఆ మాటలు విద్వేషాన్ని ప్రేరేపించడానికో, లేదా మత సామరస్యాన్ని దెబ్బ తీయడానికో దుర్వినియోగం చేయకూడదు.బహిరంగ వేదికలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి అంటూ కస్తూరి బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది.
ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేయడానికి కస్తూరి ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తుండంతో రెండు ప్రత్యేక బృందాలు ఆమె కోసం గాలిస్తున్నాయి.
![]() |
![]() |