![]() |
![]() |
.webp)
శివ కార్తికేయన్(sivakarthikeyan)సాయి పల్లవి(sai pallavi)జంటగా రాజ్ కుమార్ పెరియ స్వామి(Rajkumar Periasamy)దర్శకత్వంలో కమల్ హాసన్(kamal haasan)నిర్మించిన అమరన్(amaran)దివాలి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.తమిళనాడు కి చెందిన దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్(major mukund varadarajan)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రెండు వందల అరవై కోట్ల రూపాయల క్రాస్ ని రాబట్టి సరికొత్త హిస్టరీ ముంగిట నిలిచింది.
రీసెంట్ గా శివ కార్తికేయన్ కి పర్సనల్ లైఫ్ కి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అమరన్ సినిమాలో ఎలా అయితే యంగ్ ముకుంద్ గెటప్ లో కనపడ్డాడో ఆ గెటప్ లో తన భార్య ఆర్తి వంటిట్లో ఉంటే వెళ్లి ఆమె వెనుక సైలెంట్ గా ఉన్నాడు. ఆర్తి(aarti)మాత్రం శివ కార్తికేయన్ ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది.ఆ తర్వాత కాసేపటికి వెనక్కి తిరిగి చూసి ఒక్క సారిగా షాక్ కి గురయ్యింది. ఆ తర్వాతప్రేమగా తన భార్యపై చెయ్యి వేసి నవ్వాడు. క్యూట్ వీడియో అంటూ శివ కార్తికేయన్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

![]() |
![]() |