![]() |
![]() |

విజయ్ దేవరకొండ(vijay devarakonda)పూరి జగన్నాధ్(puri jagannadh)కాంబోలో 2022 లో వచ్చిన లైగర్(liger)ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భామ అనన్య పాండే. హిందీ చిత్రసీమలో సుమారు వందకి పైగా చిత్రాలు చేసిన స్టార్ యాక్టర్ చుంకీ పాండే కూతురే అనన్య పాండే. మహిళల మీద జరుగుతున్న అఘాయాత్యాల గురించి కొన్ని సూచనల్ని తప్పకుండా పాటించాలని చెప్తుంది.
ఇప్పుడు మహిళలకు చీకటి కాలం నడుస్తుంది.కాబట్టి సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం మీద మహిళలకి అవగాహన ఉండాలి. మన చుట్టూ ఉండే పరిసరాలను గమనించుకుంటూ ప్రతి వ్యక్తి పైన అవగాహనని పెంచుకోవాలి. అలాగే మహిళల మీద జరుగుతున్న దాడుల్ని ఆపడం కోసం ఏం చెయ్యాలో ఆలోచించాలి. ఎందుకంటే ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థితులని ఎదుర్కొంటున్నాం.నేను ఇలాంటి పరిస్థితులపై ఎప్పటి కప్పుడు చర్చిస్తూనే ఉన్నాను. వాస్తవానికి చట్టాలను మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది చాలా అవసరమైన నిర్ణయం కూడా. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు కూడా తీసుకోవాలి. కాకపోతే గతంలో పోలిస్తే ఇప్పుడు నటీమణులు వాళ్ళ సమస్యలని దైర్యంగా చెప్పగలుగుతున్నారని చెప్పింది.

2019 లో సినీ రంగ ప్రవేశం చేసిన అనన్య ఇప్పటి వరకు పది సినిమాల దాకా చేసింది. రీసెంట్ గా వచ్చిన బాడ్ న్యూస్ లో ఒక స్పెషల్ అప్పియరెన్స్ క్యారక్టర్ లో మెరిసింది.ప్రెజంట్ అక్షయ్ కుమార్ తో కలిసి శంకర అనే మూవీ చేస్తుండగా సిటిఆర్ఎల్ అనే మరో మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
![]() |
![]() |