![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కూడా అవుతారని సినీ రాజకీయ ప్రముఖులు ఎందరో అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మాత్రం.. పవన్ ప్రధానమంత్రి కావాలని ఆశపడుతున్నారు.
సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జానీ మాస్టర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం. 2029లో సీఎం. 2034లో పీఎం అవుతారు" అవుతారు జనసైనికుల్లో ఉత్సాహం నింపారు జానీ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
![]() |
![]() |