![]() |
![]() |

ప్రస్తుతం 'దేవర' (Devara) పైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఆ సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా సాంగ్స్ ఒక ఊపు ఊపుతున్నాయి. 'దేవర' ఫస్ట్ సింగిల్ గా విడుదలైన 'ఫియర్ సాంగ్' చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక సెకండ్ సింగిల్ గా విడుదలైన 'చుట్టమల్లే సాంగ్' అంతకుమించి అన్నట్టుగా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. (Devara Songs)
'చుట్టమల్లే' సాంగ్ కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో తెలుగు వెర్షన్ కే 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ వ్యూస్ కి చేరువైంది. ఇక మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ స్పాటిఫైలో కూడా 'చుట్టమల్లే' సాంగ్ దుమ్మురేపుతోంది. ఒక్క రోజులోనే 1 మిలియన్ కి పైగా స్ట్రీమ్స్ ని సొంతం చేసుకొని సరికొత్త రికార్డుని సృష్టించింది. ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు సాంగ్ 'చుట్టమల్లే' కావడం విశేషం. (Chuttamalle Song)
అనిరుద్ సంగీతం అందిస్తున్న 'దేవర' నుంచి మూడో సాంగ్ 'దావూది' (Daavudi) రేపు(సెప్టెంబర్ 4) విడుదలవుతుంది. ఇది డ్యాన్స్ డ్యూయెట్. ఈ సాంగ్ విడుదలయ్యాక ఒక ఊపు ఊపడం ఖాయమని అంటున్నారు.
![]() |
![]() |