![]() |
![]() |
.webp)
మూవీ : షేడ్స్ ఆఫ్ బేబీ పింక్
నటీనటులు: యశస్విన్, జయలలిత, శ్రీనివాస్ బోగిరె, కృష్ణ మంజూష
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
మ్యూజిక్: వర్కీ
సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి
నిర్మాతలు: జి.ఎస్.ఆర్ కె. ప్రసాద్
రచన, దర్శకత్వం: నీలిమ గుడవల్లి
ఓటీటీ: ఈటీవి విన్
కథ :
ఓ అయిదు సంవత్సరాల చిన్నపిల్లాడు గుండు(యశస్విన్) తన అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరుగుతుంటాడు. గుండు వాళ్ళ అమ్మనాన్న ఇద్దరు యూఎస్ లో ఉంటారు. అయితే గుండు పుట్టిన కొన్నినెలల వరకు ఇండియాలోని ఉన్న వారి తల్లిదండ్రులు.. అతడిని ఆరునెలల పాటు వదిలి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పరిస్థితులు అక్కడ అలా ఉంటాయి. అయితే అప్పటి నుండి గుండు తన అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరుగుతుంటాడు. మొదట కొన్ని రోజులు బాగానే ఉంటాడు గుండు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు గుండు వాళ్ళ అమ్మనాన్నలని వదిలి అన్ని నెలలు ఎలా ఉండగలిగాడు? అతని లైఫ్ లోని షేడ్స్ తెలియాలంటే ఈ ' షేడ్స్ ఆఫ్ బేబీ పింక్' చూడాల్సిందే.
విశ్లేషణ:
కథ చాలా సింపుల్.. అమ్మమ్మ, నానమ్మల దగ్గర ఓ అయిదేళ్ళ బాబు కొన్ని రోజులు ఉంటాడు. అయితే కొంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత వాళ్ళ అమ్మనాన్నలని బాగా మిస్ అవుతాడు. అమ్మమ్మ, తాతయ్యలతో గుండు ఆడుకుంటాడు.. సరదగా ఉంటాడు.. తింటాడు.. పడుకుంటాడు.. ఇలా ప్రతీది నార్మల్ గా ఉంటుంది. అయితే రోజులు, నెలలుగా మారే కొద్ది అతనిలో వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ పెరిగిపోతుంది. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఏం చేసిందనేదే కథ. కథ ప్రెజెంటేషన్ బాగుంది.
ఈ కథ నిడివి కూడా పెద్దగా ఏం లేదు.. సరిగ్గా ముప్పై మూడు నిమిషాలు.. అందులో టైటిల్స్ కోసం చివరి రెండు నిమిషాలు తీసేస్తే సరిగ్గా ముప్పై ఒక్క నిమిషం.. ఇది ఎందుకు చెప్తున్నానంటే.. కథ మొదలైన ఓ పది నిమిషాలకే కథ చాలా బోరింగ్ అనిపిస్తుంది. కానీ అదంతా ఎందుకు తీసాడనేది చివరి పది నిమిషాల్లో గుండు, వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యల పాత్రలు చెప్పే మాటలు.. హావభావాలు అంత ఇంపాక్ట్ ఇస్తాయి. అంటే ఇది ప్రతీ ఒక్కరి లైఫ్ లో ఓ ఫేజ్ .. అలా డిఫరెంట్ గా ఉండే కొన్ని సందర్భాలు ఉంటాయి. ప్రతీ ఒక్కరిలో ఆ షేడ్స్ ఉంటాయి. కానీ ఓ అయిదేళ్ళ కుర్రాడు దానిని ఎలా ఎదుర్కుంటాడనేది ఇందులో చక్కగా చూపించారు.
ఇందులో గుండు అలియాస్ యశస్విన్ పాత్ర చుట్టూనే కథ సాగుతుంది. కథ మొదలైనప్పటి నుండి స్లోగా అనిపించినా అరగంటే కాబట్టి హ్యాపీగా చూసేయొచ్చు. అడల్ట్ సీన్లు ఏమీ లేవు.. అసభ్య పదజాలం ఎక్కడ వాడలేదు. ప్యూరిటి ఆఫ్ ఎమోషన్స్ ని కథగా మన ముందుకు తీసుకొచ్చారు నీలిమ గుడవల్లి. ఫ్యామిలీ అంతా కలిసి అలా సరదగా కబుర్లు చెప్పుకుంటూ చూసే కథ ఇది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది . నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
గుండు పాత్రలో యశస్విన్ ఒదిగిపోయాడు. కథ మొత్తం అతనే కనిపిస్తాడు. అమ్మమ్మ పాత్రలో జయలలిత ఆకట్టుకుంటుంది. శ్రీమివాస్ బోగిరె, కృష్ణ మంజూష తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్ గా : సింపుల్ ఫీల్ గుడ్ స్టోరీ.. కాస్త సాగదీత అంతే.. ఫ్యామిలీతో కలిసి చూసే కథ.
రేటింగ్ : 2.5 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |