![]() |
![]() |
.webp)
వరుస హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న నాచురల్ స్టార్ నాని ఈ గురువారం సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరల్డ్ వైడ్ గా నాని కెరీరి లోనే హయ్యెస్ట్ థియేటర్స్ లో విడుదల అవ్వగా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.
కోపాన్ని కంట్రోల్ చేసుకునే సూర్య క్యారక్టర్ లో నాని ఒక రేంజ్ పెర్ఫార్మ్ చేసాడనే కామెంట్స్ తో పాటు పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎస్ జె సూర్య కూడా అదరగొట్టాడనే మాటలు ట్విట్టర్ సాక్షిగా వినిపిస్తున్నాయి. అలాగే హీరోయిన్ గా చేసిన ప్రియాంక మోహన్ తో పాటుగా మిగతా అందరు సినిమాకి ప్లస్ అయ్యారని కూడా అంటున్నారు.నాని కెరీర్ లోనే ఒక డిఫరెంట్ మూవీ అని మాస్ ప్రేక్షకులకి ఫుల్ మీల్స్ ఖాయమనే అభిప్రాయం కూడా వ్యక్త మవుతుంది. ఇక నాని ఫ్యాన్స్ అయితే మా హీరో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడని ట్విటర్ లో ఫుల్ హుంగామ చేస్తున్నారు.అంతకు మించి హిట్ అనే ఫ్యాన్స్ కూడా లేకపోలేదు.
అలాగే ఆర్ ఆర్ ఆర్ దానయ్య ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు వివేక్ ఆత్రేయ దర్శకత్వం కూడా చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఒరిజినల్ రివ్యూ వస్తే గాని అసలు విషయం తెలియదు. ఆల్రెడీ టీజర్, ట్రైలర్ తో సరిపోదా శనివారం మీద అందరిలోను హై రేంజ్ అంచనాలే ఉన్నాయి.
![]() |
![]() |