![]() |
![]() |

మలయాళ చిత్ర సీమకి చెందిన ప్రముఖ నటులు జయసూర్య(jayasurya)ముకేశ్(mukesh,)మనియన్ పిళ్ళై రాజు(maniyan pillai raju)ఇడవేల బాబు(idavela babu)లు నన్ను లైంగికంగా వేధించారు. అసలు ఆ నలుగురి వల్లే మలయాళ ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఈ మాటలన్నీ అంటుంది ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటి మిను.
మిను పూర్తి పేరు మిను మున్నీర్(minu munner)చాలా సినిమాల్లో మంచి మంచి పాత్రలే పోషించి మంచి గుర్తింపు ని సంపాదించింది. 2008లో తనకు ఎదురైన కష్టాలను గుర్తు చేసుకుంటూ ఒక సినిమా షూటింగ్‌లో జయసూర్య తనను వెనుక నుండి కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత తన ఫ్లాట్‌కి కూడా ఆహ్వానించాడని చెప్పుకొచ్చింది. అలాగే 2013 నాటికే ఆరు సినిమాల్లో నటించానని, మలయాళ నటీనటుల సంఘం అమ్మలో సభ్యత్వం పొందాలంటే కేవలం మూడు సినిమాల్లో నటిస్తే చాలు. కానీ నాకు సభ్యత్వం ఇవ్వలేదు. ఈ విషయంపై ఇడవెల బాబు కి ఫోన్ చేస్తే ఒక ఫారమ్ నింపడానికి తన ఫ్లాట్‌కి రమ్మన్నాడు. వెళ్ళాక మెడపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత భయంతో అక్కడనుంచి వెళ్ళిపోయాను. ముఖేష్ కూడా ఫోన్‌లో అనుచితంగా మాట్లాడి తనను విల్లాకు ఆహ్వానించాడని ఆరోపించింది.

అలాగే ఒక సారి కారులో వెళ్తున్నప్పుడు మణియంపిల్ల రాజు అనుచితంగా మాట్లాడాడు. దాంతో విసుకొచ్చి చెన్నైవెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. కేరళ ప్రభుత్వం మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ ని ఏర్పాటు చెయ్యడంతో కొంత మంది నటీమణులు దైర్యంగా ముందుకొచ్చి తమకి ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్తున్నారు.హేమ కమిటీ కూడా మహిళా నటీమణుల పై లైంగిక దాడులు జరుగుతున్నాయని వెల్లడి చేసింది.
![]() |
![]() |