![]() |
![]() |
ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలకుగానీ, ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు అంత ప్రాధాన్యం ఉండక పోవచ్చు. ఎందుకంటే ఈ వారం స్టార్ హీరోల సినిమాలేవీ రిలీజ్ అవ్వడం లేదు. తెలుగులో నాని హీరోగా ఆగస్ట్ 29న రిలీజ్ అవుతున్న ‘సరిపోదా శనివారం’ ఒక్కటే చెప్పుకోదగ్గ సినిమా. అలాగే ఓటీటీలో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను పక్కన పెడితే తెలుగు, తమిళ్, హిందీ భాషలకు సంబంధించి ఓటీటీలు చప్పగా ఉండే అవకాశం ఉంది. అయితే వాటిలోనూ కొన్ని మాత్రమే చెప్పుకోదగ్గవి ఉన్నాయి.
హిందీలో అనుభవ్ సిన్హా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఐసి814 ది కాందహార్ హైజాక్’ వెబ్ సిరీస్ మాత్రం కాస్త ఆసక్తికరంగా ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 1999 డిసెంబర్ 24న కాందహార్‌లో జరిగిన ఫ్లైట్ హైజాక్ నేపథ్యంలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో అరవింద్ స్వామి ఒక కీలక పాత్రలో నటించారు. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. అల్లు శిరీష్ నటించిన ‘బడ్డీ’ అప్పుడే థియేటర్ల నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి వచ్చేస్తోంది. ఆగస్ట్ 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ జరుగుతుంది. ఇవికాక ఓటీటీలో సందడి చేయబోతున్న వివిధ భాషా చిత్రాలు, వెబ్‌సిరీస్ ఏమిటో ఓ లుక్కేద్దాం.
అమెజాన్ ప్రైమ్ :
ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్-2 (ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 29
లయన్స్ గేట్ ప్లే :
హెన్రీస్ క్రైమ్ (ఇంగ్లీష్)- ఆగస్టు 30
ది సెప్రెంట్ క్వీన్ సీజన్-2 (ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 30
జియో సినిమా :
అబిగైల్ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్టు 26
గాడ్జిల్లా ఎక్స్ కింగ్: ది న్యూ ఎంపైర్(ఇంగ్లీష్ సినిమా)- ఆగస్టు 29
క్యాడేట్స్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్టు 30
నెట్‌ఫ్లిక్స్ :
బడ్డీ (తెలుగు సినిమా)- ఆగస్టు 30
ఐసీ 814: ది కాందహార్ హైజాక్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్టు 29
కావోస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29
పోలైట్ సోసైటీ -(ఇంగ్లీష్ సినిమా)- ఆగస్టు 28
టర్మినేటర్ జీరో-(ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 29
జీ5 :
ఇంటరాగేషన్ (హిందీమూవీ)- ఆగస్టు 30
ముర్షిద్ (హిందీ సిరీస్)- ఆగస్టు 30
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :
ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్. సీజన్-4- ఇంగ్లీష్ వెబ్ సిరీస్- ఆగస్టు 27
కానా కానుమ్ కాలంగల్. సీజన్-3- తమిళ వెబ్ సిరీస్- ఆగస్టు 30
![]() |
![]() |