![]() |
![]() |

"చట్టం ఎవరికీ చుట్టం కాదు" వంటి మాటలు పుస్తకాలకే పరిమితమవుతుంటాయి. డబ్బు, పలుకుబడి ఉన్నోళ్లకి చట్టం చుట్టం అవుతుంది అని ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా కన్నడ హీరో దర్శన్ (Darshan) విషయంలో మరోసారి రుజువైంది.
తన అభిమాని రేణుకాస్వామిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో దర్శన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జూన్ 11న దర్శన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్శన్ జైల్లోనే ఉన్నాడు. చేసిన తప్పుకి దర్శన్ శిక్ష అనుభవిస్తున్నాడని అందరూ భావించారు. కానీ అతను జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. కాఫీలు, సిగరెట్ లు తాగుతూ.. మొబైల్ లో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఏదో ఇంట్లో గార్డెన్ లో కూర్చున్నట్టుగా.. జైలు ఆవరణలో తన మేనేజర్, అదే జైల్లో ఉంటున్న ఒక గ్యాంగ్‌స్టర్‌తో మరియు ఇంకో వ్యక్తితో కలిసి.. దర్జాగా కూర్చొని, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, చేతిలో కప్ పట్టుకొని, సిగరెట్ తాగుతూ ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా విమర్శలు గుప్పుమన్నాయి. జైలు అధికారుల తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారంపై కర్నాటక ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఏడుగురు జైలు అధికారులపై వేటు వేసింది.
![]() |
![]() |