![]() |
![]() |
ఎస్.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై ఊడుగు సుధాకర్ నిర్మాతగా ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఎస్.ఎస్.సైదులు హీరోగా భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా, ఎం.ఎల్.రాజా సంగీత దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘1980లో రాధేకృష్ణ’. ఈ సినిమాని తెలుగు, బంజారా భాషల్లో విడుదల చేస్తున్నారు. శనివారం ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిర్మాత బెక్కం వేణుగోపాల్, నిర్మాత రామ్ తాళ్ళూరి, హీరో సోహెల్, ఆటో రాంప్రసాద్ విచ్చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ ‘ఇది మా జిల్లాలో తీసిన సినిమా. సినిమా టీజర్ బాగుంది పాటలు చాలా బాగున్నాయి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమా నిర్మాతకి డబ్బులు నటీనటులకి మంచి పేరు తీసుకురావాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి నేను ఎప్పుడూ ముందు ఉంటాను. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ సినిమా తీశారు’ అన్నారు. సోహెల్ మాట్లాడుతూ ‘ఈ సినిమా టీం నాకు ఫ్యామిలీ లాంటిది. మా సైదుల్ని నిర్మాతని టీం ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు’ అన్నారు. ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ ‘టీజర్ చాలా బాగుంది. కచ్చితంగా ఈ సినిమా ఈ టీంకి మంచి పేరు సక్సెస్ తెచ్చిపెడుతుంది’ అన్నారు.
నిర్మాత ఊడుగు సుధాకర్ మాట్లాడుతూ ‘ఎంతో బిజీగా ఉండి కూడా సపోర్ట్ చేయడానికి వచ్చిన బెక్కం వేణుగోపాల్ గారికి, హీరో సోహెల్ గారికి, రామ్ తాళ్ళూరిగారికి, ఆటో రాంప్రసాద్‌గారికి కృతజ్ఞతలు. ప్రేక్షకులు మా సినిమాని మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ ‘సినిమా పూర్తయింది. టీజర్ ఎవరితో చేయించాలి అనుకున్నప్పుడు తనికెళ్ల భరణి గారు వాయిస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆయన వాయిస్‌తో టీజర్‌కి ఒక కొత్త ఫీల్ వచ్చింది. అదేవిధంగా బెక్కం వేణుగోపాల్ గారు క్లైమాక్స్ కి చేసిన సజెషన్స్ బాగా హెల్ప్ అయ్యాయి. అదేవిధంగా రామ్ తాళ్ళూరిగారు ముందు నుంచీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.
![]() |
![]() |