![]() |
![]() |

మొత్తానికి అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)ఒక ఇంటివాడు అవుతున్నాడు. తన స్నేహితురాలైన శోభిత ధూళిపాళ్ల(sobhita dhulipala) తో కలిసి ఏడు అడుగులు నడవబోతున్నాడు. ఈ మేరకు రెండు రోజులు క్రితం ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ గురించి అక్కినేని నాగార్జున ఎంతగా ఆనందపడుతున్నాడో, అంత కంటే ఎక్కువ ఆనందాన్ని అభిమానులు కూడా పొందుతున్నారు. సోషల్ మీడియా కూడా వాళ్ళ కంటే ఎక్కువ ఆనంద పడుతుంది. అందుకే ఇప్పుడు చై ,శోభిత ల పెళ్లి పలానా రోజు వుండబోతుందనే న్యూస్ ఒక దాన్ని స్ప్రెడ్ చేస్తుంది.పైగా ఆ డేట్ కి ఇంకో అద్భుతం కూడా జరగబోతుందనే రూమర్ ని కూడా మోస్తుంది.
నాగ చైతన్య మొదటి వివాహం ప్రముఖ హీరోయిన్ సమంత(samantha)తో జరిగిన విషయం అందరకి తెలిసిందే. ఏ మాయ చేసావే టైంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొద్దీ రోజులకే అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడిపోయారు. 2021 లో అత్యంత వైభవంగా వారిరువురి వివాహం జరిగింది .అక్టోబర్ 6 న హిందూ పద్దతిలో, అక్టోబర్ 7 న క్రిస్టియన్ పద్దతిలో జరిగింది. ఇప్పుడు ఈ డేట్ కే చై, శోభిత ల వివాహం జరుగుతుందనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అదే విధంగా ఇంకో ఆసక్తి కర న్యూస్ కూడా వినపడుతుంది. చై సమంత ల ఎంగేజ్ మెంట్ 2017 జనవరి లో జరిగింది. వివాహం మాత్రం నాలుగు సంవత్సరాల తర్వాత జరిగింది. ఇప్పుడు చై, శోభిత లు కూడా అన్ని సంవత్సరాల గ్యాప్ తీసుంటారేమో అనే వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే సమంత అంటేనే పట్టుదలకు మారుపేరు. దీంతో చై పెళ్లి రోజే తను కూడా పెళ్లి చేసుకుంటుందేమో అనే రూమర్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి చై అండ్ సమంత సినిమాల గురించి ఆలోచిస్తే చై తండేల్ తో బిజీ గా ఉండగా సమంత సిటాడెల్ హనీ బన్నీ హిందీ వెబ్ సిరీస్ తో బిజీ గా ఉంది. వరుణ్ ధావన్ హీరో.
![]() |
![]() |