![]() |
![]() |
.webp)
సినిమా చిన్నదైనా పెద్దదైనా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండి, కాసిన్ని ట్విస్ట్ లు, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటే చాలు ఆటోమేటిక్ గా ప్రేక్షకుడు ఆచరిస్తాడు. అలాంటి థీమ్ తో కొత్తగా ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
ఈ సినిమా పేరే 'గోళం'. ఇది ఓటీటీలోకి ఏ హడావుడి లేకుండా వచ్చేసింది. మలయాళంలో నుండి ఈ ఏడాది వచ్చిన కొన్ని సినిమాలు అంచనాలకి మించి రికార్డులని సొంతం చేసుకున్నాయి. గోళం లోని నటీనటులతో పాటు దర్శకుడు కొత్త వాడే కావడం విశేషం. సంజత్ ఈ మూవీ దర్శకుడు. రంజిత్ సజీవ్, దిలేష్ పోతన్ , చిన్ను చాందినీ తదితరులు నటించగా, ప్రవీణ్ విశ్వనాథ్ కథని అందించాడు.
మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్ తో తీసిన ఈ మూవీ మలయాళంలోని చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థ్రిల్లర్ సినిమాలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ చక్కగా కుదరడంతో ఇది హిట్ గా నిలిచింది. చివరి వరకు సస్పెన్స్ తో పాటు ట్విస్టులు ఉన్న ఈ సినిమాని ఓ సారి ట్రై చేయండి.
![]() |
![]() |