![]() |
![]() |

మహీంద్ర పిక్చర్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా రూపొందిన మూవీ సంఘర్షణ. చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వల్లూరి. శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 9న థియేటర్స్ లో అడుగు పెట్టింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్న చైతన్య (చైతన్య పసుపులేటి), సంయుక్త (రసీదా భాను) లైఫ్ లో అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనతో వారి జీవితాలు ఊహించని మలుపులు తిరుగుతాయి. మరోవైపు సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. పోలీస్ ఆఫీసర్ దీపక్ (శివ) వాటిపై ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఈ మర్డర్స్ కు చైతన్య కు సంబంధం ఏమిటి? కరణ్ పాత్ర ఏంటి? అతనికి, అతని గ్యాంగ్ కు ఈ మర్డర్స్ తో సంబంధం ఏంటి? అసలు చైతన్య, సంయుక్త జీవితాల్లో జరిగిన అనుకోని సంఘటన ఏంటి? ఆ సంఘటన వల్ల వాళ్ళు ఎలాంటి రిస్క్ ఫేస్ చేశారు? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న క్రైం సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు ఎస్.చిన్న వెంకటేష్ సంఘర్షణ సినిమాను తెరకెక్కించారు. కర్మ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని కథను రాసుకున్నారు. ఆ కథకి తగ్గట్టుగా ఆసక్తికర కథనం కూడా తోడైంది. వరుస హత్యలు, దాని చుట్టూ జరిగే ఇన్వెస్టిగేషన్ తో సినిమా ఇంట్రెస్టింగ్ గా నడిచింది. ట్విస్ట్ లు కూడా ఆకట్టుకున్నాయి.
వెంకటేష్ నూతన దర్శకుడైన అనుభవం కలిగిన దర్శకుడిలా చేశారు. కె.వి.ప్రసాద్, సుధాకర్ బాట్లే సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి వర్క్ నీట్ గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య శ్రీరామ్ సంగీతం ఆకట్టుకుంది. ముఖ్యంగా నేపధ్య సంగీతం మెప్పించింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
చైతన్య, రసీదా బాగా నటించారు. ఎక్స్ప్రెస్ హరి కామెడీ టైమింగ్ బాగుంది. శివ రామచంద్రవరుపు పోలీస్ పాత్రకు న్యాయం చేశాడు. కరణ్ తదితరులు వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా...
క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి సంఘర్షణ నచ్చుతుంది.
![]() |
![]() |