![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ సూర్య తన 44వ సినిమాని కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. 'సూర్య 44' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రం పూజ హెగ్డే హీరోయిన్. సూర్య ఓన్ బ్యానర్ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ లో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో సూర్య గాయపడ్డాడు. ఆయన తలకు బలమైన గాయమైనట్లు వార్తలొచ్చాయి. దీంతో సూర్య అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో 2డి ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓ, నిర్మాత రాజశేఖర్ పాండ్యన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సూర్యకి గాయమైన మాట వాస్తవమేనని చెప్పిన ఆయన.. అది స్వల్ప గాయమని తెలిపారు. సూర్య క్షేయంగా ఉన్నారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

![]() |
![]() |