![]() |
![]() |

రీసెంట్ గా పవన్ కళ్యాణ్(pawan kalyan)అటవీ శాఖ మంత్రి హోదాలో కర్ణాటక లో ఒకప్పుడు సినిమాల్లో అడవుల్ని రక్షించే క్యారెక్టర్స్ లో హీరోలు కనపడే వాళ్ళు. కానీ ఇప్పుడు అడవుల్ని నరికేసి, స్మగ్లింగ చేసే క్యారెక్టర్స్ ని పోషిస్తున్నారు అంటూ మాట్లాడిన విషయం తెలిసిందే. ఇవి అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసాడనే చర్చ కొంత మంది మధ్య జరుగుతుంది. అలా అనుకునే వాళ్లందరికీ ప్రముఖ నిర్మాత నట్టికుమర్ సమాధానాన్ని ఇచ్చాడు.
నట్టి కుమార్(natti kumar) సుదీర్ఘ కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంటూ నిర్మాతగా సినిమాలని నిర్మించడంతో పాటు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తు వస్తున్నారు. తాజాగా ఒక టీవీ ఛానెల్ డిబేట్ లో మాట్లాడుతు పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి హోదాలో ఒక అడవికి జరిగిన అన్యాయం చూసి చలించి పోయారు . దాంతో నలభై ఏళ్ళ క్రితం హీరోలుగా చేసిన కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారితో పాటు రామారావు,నాగేశ్వరరావు గార్లు అడవులతో పాటు అందులో ఉండే , ఏనుగులని, మిగతా జంతువులని, చెట్లని కాపాడే క్యారెక్టర్స్ ని పోషించే వాళ్ళు. ఆ విధంగా ఒక మెసేజ్ ని మనం ఇచ్చాం. కానీ ఇప్పుడున్న హీరోలు మాత్రం అడవులని దోచుకుంటూ స్మగ్లింగ్ చేసుకుంటున్నారని, అప్పటి సినిమాకి ఇప్పటి సినిమాకి తేడాని మాత్రమే చెప్పాడు.
దీన్ని బట్టి పవన్ ఉద్దేశ్యం ఏంటో మనకి స్పష్టంగా అర్ధమవుతుంది. అటవీ శాఖకి ఇన్నాళ్లు అన్యాయం జరుగుతు వస్తుంది ఆ ఆవేదనతోనే మాట్లాడాడు. అంతే కానీ అల్లు అర్జున్(allu arjun) ని గాని పుష్ప మూవీని ఉద్దేశించి గాని అనలేదని నట్టికుమార్ చెప్పుకొచ్చాడు. అదే విధంగా రాజకీయాలు వేరు సినిమా వేరని ఇదే విషయాన్నీ పవన్ గతంలో చెప్పిన విషయాన్ని కూడా నట్టి కుమార్ గుర్తు చేసాడు.
![]() |
![]() |