![]() |
![]() |
టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న సూపర్‌స్టార్ మహేష్ పుట్టినరోజు ఆగస్ట్ 9. ఈ సందర్భంగా మహేష్ మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అతనికి బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ఇక అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇండియాలోనే గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటున్న రష్మిక మందన్న తన హీరోకి బర్త్‌డే విషెస్‌ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
‘మన అందరి సూపర్‌స్టార్‌కి ఇది ఎంతో సంతోషకరమైన పుట్టినరోజు. మీరంటే ఎల్లప్పుడూ అపరిమితమైన గౌరవం, ప్రేమ ఉంటాయి. మీకు నా బెస్ట్ విషెస్ సర్’ అంటూ ఎంతో ఆప్యాయంగా రష్మిక పెట్టిన విషెస్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ విషెస్‌తోపాటు ఆమె షేర్ చేసిన ఫోటో హార్ట్ టచ్చింగ్‌గా ఉంది. మహేష్‌కి రష్మిక పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన విధానం మహేష్ అభిమానులనే కాదు, అందర్నీ టచ్ చేసింది.
![]() |
![]() |