![]() |
![]() |
.webp)
రోజా(roja)తొంభైయ్యవ దశకంలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి అసభ్య చేష్టలతో , పదజాలంతో ఉన్న పేరుని మొత్తం పోగొట్టుకొని ప్రతి ఒక్కరి నుంచి విమర్శలు ఎదుర్కొంది. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికలో ఘోర పరాజయాన్ని చవి చూసి ఏ రోజు ఏ ఊళ్ళో ఉంటుందో తనకే తెలియని పరిస్థితిని తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
రానున్న రోజుల్లో రోజా తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తుందనే వార్తలు వస్తున్నాయి.అందుకు శరవేగంగా పావులు కదుపుతోందని కూడా అంటున్నారు. పైగా ఆమె ప్రముఖ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్(vijay)స్థాపించిన తమిళ మున్నేట్ర కజగం లో చేరబోతుందని, నెక్స్ట్ తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా చూస్తుందని అంటున్నారు. ఇక రోజా అత్త ఇంటి వారు తమిళనాడు అన్న విషయం అందరకి తెలిసిందే.
ఆమె భర్త ఆర్ కే సెల్వమణి తమిళనాడు కి చెందిన ప్రముఖ డైరెక్టర్. సోషల్ మీడియాలో రోజా తమిళనాడు రాజకీయ వార్త చూస్తున్న రజనీ(rajini kanth)ఫాన్స్ అయితే తమిళనాడు లో రోజాకి రాజకీయ భవిష్యత్తు ఉండదని అంటున్నారు. గతంలో రజనీ ని రోజా విమర్శించిన విషయం తెలిసిందే.
![]() |
![]() |