![]() |
![]() |
.webp)
ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబో మూవీ ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాతలు. ఇక ఒక మాములు హీరో మూవీ ఓపెనింగ్ కే చిత్ర పరిశ్రమకి చెందిన చాలా మంది బిగ్ షాట్స్ హాజరవుతారు. అలాంటిది ఎన్టీఆర్ లాంటి బడా మూవీకి అలాంటి వాళ్ళు ఎవరు కనపడక పోవడం ఇప్పుడు చర్చినీయాంశం గా మారింది.
సినిమా ఓపెనింగ్ రోజు ఫస్ట్ షాట్, ఫస్ట్ క్లాప్, కెమెరా ఆన్ చేయడంకోసం చాలా మంది సినీ సెలెబ్రెటీస్ వస్తారు. కానీ ఎన్టీఆర్ మూవీకి అలాంటివేం జరగలేదు. ఎన్టీఆర్ క్లాప్ కొట్టగా ఎన్టీఆర్ సతీమణి ప్రణతి ఇద్దరు పిల్లలతో కలిసి కెమెరా ఆన్ చేసింది. ఇక స్క్రిప్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు అండ్ కళ్యాణ్ రామ్ దర్శకుడు ప్రశాంత్ కి అందచేశారు. ప్రశాంత్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అలాగే కళ్యాణ్ రామ్ తో పాటు ప్రముఖ నిర్మాతలైన దిల్ రాజు, హర్షిత్, తో మినహా మరెవరూ సినిమాతో సంబంధం లేని వారు హాఙరు కాలేదు, ఎన్టీఆర్ సినిమా కాబట్టి ఈ విషయం పెద్దగానే హైలెట్ అవుతుంది.

సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని,దేవర , వార్ 2 లతో ఎన్టీఆర్ బిజీ గా ఉండటం వల్ల వేరే ఆర్టిస్టులతో షూట్ ని ప్రారంభం చేస్తారని అంటున్నారు .ఇక మూవీ విడుదల డేట్ ని కూడా మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.జనవరి 9 2026 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ న్యూస్ తో ఎన్టీఆర్ అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో హంగామా కూడా స్టార్ట్ చేసారు. ఆ రోజు ఏ మూవీ కూడా పోటీకి రాకపోతేనే నయం. ఒక వేళ వస్తే ఎన్టీఆర్ ప్రశాంత్ సునామిలో వెనకపడటం ఖాయం అని అంటున్నారు.
![]() |
![]() |