![]() |
![]() |

ప్రస్తుతం సినిమా టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. ముఖ్యంగా తెలంగాణలో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇది చాలదు అన్నట్టు బడా సినిమాల విడుదల సమయంలో.. ధరలు పెంపుకి వెసులుబాటు లభిస్తోంది. దీంతో సామాన్యులు కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చూసేవారు.. ఇప్పుడే ఒకట్రెండు భారీ సినిమాలు చూసి టికెట్ ధరల దెబ్బకి అమ్మో అంటున్నారు. ఖచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా అనిపిస్తేనే చూస్తున్నారు. ఆ ప్రభావం చిన్న, మీడియం రేంజ్ సినిమాలపై పడుతుంది.
చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు థియేటర్లలో ఆదరణ లభించాలంటే.. కంటెంట్ బాగుండటంతో పాటు, టికెట్ ధరలు కూడా అందుబాటులో ఉండాలి. ఈ విషయాన్ని 'బడ్డీ' మూవీ టీం గ్రహించింది. అందుకే టికెట్ ధరల విషయంలో దిగొచ్చింది. సింగిల్ స్క్రీన్ లో రూ.99, మల్టీప్లెక్స్ లో రూ.125 గా టికెట్ ధరను నిర్ణయించారు. ఇది మంచి నిర్ణయమని చెప్పవచ్చు. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. థియేటర్లలో ఈ సినిమాని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు.

కాగా, అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ సినిమాకి సామ్ ఆంటోన్ దర్శకుడు. స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |