![]() |
![]() |

విడుదల తరువాత సినిమాని పైరసీ నుంచి కాపాడుకోవడం ఎంత కష్టమో, చిత్రీకరణ సమయంలో లీకులు కాకుండా కాపాడుకోవడం కూడా అంతే కష్టం. షూటింగ్ దశలో ఉన్న పలు బడా సినిమాలకి సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్ లు లీక్ అవుతుంటాయి. ముఖ్యంగా 'దేవర' (Devara)కు ఈ లీకుల బెడద ఎక్కువగా ఉంది. విడుదలకు ముందే ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యి.. అభిమానులకు సర్ ప్రైజ్ లేకుండా చేస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఫియర్ సాంగ్ ఆకట్టుకున్నాయి. మూవీ టీం నుంచి మిగతా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 'దేవర' నుంచి ఎన్టీఆర్ సెకండ్ లుక్ కి సంబంధించిన పిక్ లీక్ అయింది.
'దేవర'లో ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఒక లుక్ ని అధికారికంగా రివీల్ చేశారు. లుంగీ ధరించి, ఉంగరాల జుట్టుతో తారక్ కొత్తగా కనిపించాడు. దీంతో సెకండ్ లుక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఈ లుక్ ని మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేయకుండానే లీక్ అయింది. షార్ట్ హెయిర్, గుబురు గడ్డం, టైట్ బ్లాక్ షర్ట్ తో ఎన్టీఆర్ లుక్ సాలిడ్ గా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు అభిమానులు ఎన్టీఆర్ సెకండ్ లుక్ అదిరిపోయిందంటూ సంతోషంగా ఫొటో షేర్ చేస్తుండగా.. మరికొందరు అభిమానులు మాత్రం ఇలా ముందే లీక్ చేసి, కిక్ లేకుండా చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు.
కాగా, గతంలో గోవాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా ఒక వీడియో క్లిప్ లీక్ అయింది. ఆ క్లిప్ లో సముద్ర తీరాన ఎన్టీఆర్ నడుస్తూ కనిపించాడు. మరి ఈ లీకుల విషయంలో 'దేవర' టీం ఇకనైనా మరింత అప్రమత్తంగా ఉంటుందేమో చూడాలి.
![]() |
![]() |