![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)అనే పేరుకి ఎంత పవర్ ఉందో అందరకి తెలిసిందే.రెండున్నర దశాబ్దాలపై నుంచి తనధైన పవర్ ఫుల్ యాక్టింగ్ తో లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఆ అభిమానమే ఆయన చేత పొలిటికల్ పార్టీ స్థాపించేలా చేసింది. పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి స్థానంతో పాటు మంత్రిగా కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో పవన్ పై వస్తున్న లేటెస్ట్ కామెంట్ ఒకటి వైరల్ గా నిలిచింది.
పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా సమాజానికి తన వంతుగా ఏదైనా సహాయం చెయ్యాలనే భావంతో ఉంటాడు. ఆ ఉద్దేశ్యంతోనే తన దృష్టికి వచ్చిన ఎలాంటి సమస్య పైన అయినా స్పందిస్తుంటాడు. అంతే కాకుండా తక్షణమే వాళ్ళకి సహాయం అందేలా చూస్తాడు. అలా పవన్ చేసిన సహాయాలు కోకొల్లలు. ఇప్పటికి చేస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వార్తలు నిత్యం వస్తూనే ఉంటాయి. అదే విధంగా సమాజంలో జరిగే అన్ని విషయాలపైనా కూడా నిర్మొహమాటంగా చర్చించి మానవత్వానికి ప్రతీకగా నిలుస్తాడు.
మరి అలాంటి పవన్ కళ్యాణ్ కి అతి మంచి తనం పనికి రాదని ప్రముఖ వ్యక్తి చెప్తున్నాడు. ఒక టీవీ ఛానెల్ డిబేట్ లో పాల్గొన్న ప్రముఖ ఫిజియాలిస్ట్ ఎస్వి నాగ్ నాద్(sv nag nadh)ఈ విషయాన్ని వెల్లడించాడు. పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి. కానీ అతి మంచి తనం పనికి రాదు. ఎల్లవేళలా కూడా అలా ఉండకూడదని చెప్పుకొచ్చాడు.మరి ఆ మాటలకి పవన్ డై హార్ట్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
![]() |
![]() |