![]() |
![]() |

నటి వనితా విజయకుమార్ (Vanitha Vijaykumar) సినిమాల కంటే వ్యక్తిగత విషయాల వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని, విడాకులు తీసుకున్న ఆమె.. ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారనే వార్త హాట్ టాపిక్ గా మారింది.
ప్రముఖ నటుడు విజయకుమార్ కుమార్తె అయిన వనిత 'చంద్రలేఖ' అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ సినిమాల్లో నటించిన ఆమె, వైవాహిక జీవితం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. మొదట టీవీ యాక్టర్ ఆకాష్ ని 2000 లో వివాహం చేసుకున్నారు. మనస్పర్థలతో 2007 లో ఆకాష్ నుంచి విడిపోయిన వనిత.. ఆ తర్వాత ఆనంద్ జయరాజన్ అనే బిజినెస్ మ్యాన్ ని వివాహమాడింది. 2012 లో ఆయనకు విడాకులిచ్చిన వనిత.. దాదాపు ఎనిమిదేళ్ళకు 2020 లో పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే పీటర్ మద్యానికి బానిస కావడంతో కొద్ది నెలలకే.. ఆయన నుంచి కూడా విడిపోయారు వనిత.
గత నాలుగేళ్లుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వనిత.. ఇప్పుడు నాలుగో పెళ్ళికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో, ఇంకెన్ని పెళ్లిళ్లు చేసుకుంటారని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం తోడు కోసం మరో పెళ్లి చేసుకోవడంలో తప్పులేదని అభిప్రాయపడుతున్నారు. మరి వనిత నిజంగానే నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారా? చేసుకుంటే వరుడు ఎవరు? వంటి విషయాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |