![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటిస్తున్న చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విషయంలో తాజాగా జాన్వీ కపూర్ ఓ షాక్ ఇచ్చింది.
బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి యూత్ లో మంచి సంపాదించుకున్న జాన్వీ.. 'దేవర'తోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ యాక్షన్ తో పాటు, జాన్వీ గ్లామర్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూస్తున్న వారికి జాన్వీ ఒక షాకిచ్చింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. దేవర తన పాత్ర పార్ట్-2 లోనే ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఈ లెక్కన చూస్తే దేవర పార్ట్-1 లో ఆమె పాత్ర కొన్ని సీన్లకు, ఒకట్రెండు పాటలకు పరిమితమవుతుంది అనిపిస్తోంది. జాన్వీ ఫస్ట్ తెలుగు మూవీ అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ఓ రకంగా ఇది షాక్ అని చెప్పవచ్చు.
కాగా, ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ కారణంగా హాస్పిటల్ లో చేరిన జాన్వీ.. తాజాగా డిశ్చార్జ్ అయింది.
![]() |
![]() |