![]() |
![]() |

ఇటీవల 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ను పూర్తి చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి సినిమాని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ స్పోర్ట్స్ బేస్డ్ మూవీకి 'పెద్ది' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
ప్రస్తుతం 'పెద్ది' ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. నటీనటుల ఎంపికతో పాటు ఇతర పనులు చకచకా జరిగిపోతున్నాయి. మరోవైపు ఈ సినిమా కోసం రామ్ చరణ్ స్పెషల్ గా మేకోవర్ అవుతున్నాడు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం కసరత్తులు చేయడంతో పాటు.. కొత్త లుక్ కోసం జుట్టు, గడ్డం పెంచుతున్నాడు. త్వరలోనే లుక్ ఫైనల్ చేయనున్నారట. సెప్టెంబర్ నుంచి పెద్ది మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
గేమ్ ఛేంజర్ షూటింగ్ బాగా ఆలస్యం కావడంతో మెగా అభిమానులు ఎంతో నిరాశ చెందారు. 'పెద్ది' విషయంలో అలా జరగకుండా పక్కా ప్లానింగ్ తో అనుకున్న టైమ్ కి షూట్ ను పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న 'పెద్ది' చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
![]() |
![]() |