![]() |
![]() |

'షాక్', 'మిరపకాయ్' తరువాత మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'మిస్టర్ బచ్చన్' (Mr Bachchan). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుందని ఇటీవల న్యూస్ వినిపించింది. ఆ న్యూస్ ని నిజం చేస్తూ.. 'మిస్టర్ బచ్చన్' చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'పుష్ప-2' (Pushpa 2) డిసెంబర్ 6కి వాయిదా పండిన సంగతి తెలిసిందే. దీంతో పలు సినిమాలు ఆగస్టు 15 పై కర్చీఫ్ వేస్తున్నాయి. ఇప్పటికే 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart), 'ఆయ్', '35' సినిమాలు ఆ తేదీకి వస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు ఆ లిస్టులో 'మిస్టర్ బచ్చన్' కూడా చేరింది. మరోవైపు తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న 'తంగలాన్' కూడా అదేరోజు విడుదల కానుంది. అంటే ఒకేసారి ఐదు సినిమాలు విడుదలవుతున్నాయన్నమాట. అయితే వీటిలో 'డబుల్ ఇస్మార్ట్', 'మిస్టర్ బచ్చన్' మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశముంది.

![]() |
![]() |