![]() |
![]() |

సినీ నటి శ్రీరెడ్డి (Sri Reddy) వివాదాలకు కేరాఫ్ అడ్రెస్. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే ఆమె కొంప ముంచేలా ఉన్నాయి. తాజాగా శ్రీరెడ్డిపై కేసు నమోదైంది.
శ్రీరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ సోషల్ మీడియా వేదికగా రాజకీయాలపై స్పందిస్తుంటారు. వైసీపీకి మద్దతుగా ఉండే ఆమె.. ప్రత్యర్థి పార్టీల నాయకులపై హద్దుమీరి వ్యాఖ్యలు చేస్తుంటారు. మాటల్లో చెప్పడానికి వీల్లేని బూతు మాటలను కూడా ఉపయోగిస్తుంటారు. శ్రీరెడ్డి తీరుపై గతంలోనే ఎందరో అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు, ఆ తరువాత.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనిత లపై పలు సందర్భాల్లో అభ్యంతర వ్యాఖ్యలు చేశారు శ్రీరెడ్డి. దీనిపై తాజాగా కర్నూల్ తెలుగుదేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారి ఫిర్యాదుతో కర్నూల్ త్రీ టౌన్ పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.
![]() |
![]() |