![]() |
![]() |

మూవీ: బూమర్ అంకుల్
నటీనటులు: యోగిబాబు, ఓవియో, రోబో శంకర్, సతీష్ మోహన్, ఎమ్. ఎస్ భాస్కర్, మదన్ బాబ్ తదితరులు
ఎడిటింగ్: ఎస్. ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: సుభాష్ దండపాణి
మ్యూజిక్: ధర్మ ప్రకాష్
నిర్మాతలు: అంబు, కార్తిక్ కె. తిల్లై
దర్శకత్వం: స్వదీస్ ఎమ్ఎస్
ఓటీటీ: ఆహా
ఈ మధ్యకాలంలో యోగిబాబు కామెడీ టైమింగ్ తెలుగు ప్రేక్షకులకి బాగా అలవాటు అయింది. తమిళంలో ఈ ఏడాది మార్చి లో విడుదలైన బూమర్ అంకుల్ మూవీ ప్రస్తుతం తెలుగు ఓటీటీ ఆహాలోకి వచ్చేసింది. హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ కథేంటో ఓసారి చూసేద్దాం.
కథ:
యోగి, అమీ భార్యాభర్తలు.. విడాకుల కోసం లాయర్ దగ్గరకి వస్తారు. అయితే అమీ తనకి విడాకులు ఇవ్వడానికి ఓ కండీషన్ పెడుతుంది. యోగి పూర్వీకుల నుండి తనకు సొంతమైన ప్యాలెస్ లో ఓ రోజు గడపాలని అమీ షరతు పెడుతుంది. ఎవ్వరు వెళ్ళకుండా ఉన్న ప్యాలెస్ కి యోగి వెళ్ళాడా? లేదా ? అసలు అమీ నిజంగానే యోగిని ప్రేమించి పెళ్ళాడిందా? యోగి నాన్న ఎవరు? యోగి వల్ల ఆ ఊరిలోని వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరిగిందనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కించిన ఈ బూమర్ అంకుల్ పెద్దగా మెప్పించదు. నవ్వు తెప్పించే ప్రయత్నంలో చేసిన ఏ సీను సెట్ అవ్వలేదు. హారర్ థ్రిల్లర్ సినిమాలలో గతంలో జరిగినది చాలా ప్రధానం. ఎందుకంటే మెయిన్ కథ అదే ఉంటుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని చాలా తగ్గించి.. ప్రస్తుతంలోనే ఆ మ్యాజిక్ పవర్స్ ని చూపించడం.. కథలోని థ్రిల్ ని మిస్ చేశాయి.
యోగి బాబులోని కామెడీ టైమింగ్ ని వాడుకోకుండా దర్శకుడు అతని చుట్టూ ఉన్నవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అది పెద్ద మైనస్. కథలోని కామెడీ కంటే మన జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ స్కిట్లు చాలా వరకు బెటర్ అనిపించేలా సాగుతుంది.
మెయిన్ కథని సరిగ్గా ప్రెజెంట్ చేయలేదు. ప్యాలెస్ లోని పవర్స్ గురించి రష్యన్ తో పాటు అన్ని దేశాలు ఎందుకు వెతుకుతున్నాయనేది మంచి కాన్సెప్ట్ .. కానీ అడ్డదిడ్డంగా సాగే స్క్రీన్ ప్లే, అనవసరమైన క్యారెక్టర్లతో అది డైవర్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ గజిబిజిగా సాగింది. కనీసం సెకండ్ హాఫ్ లో కథని క్లుప్తంగా వివరిస్తాడా అంటే అదీ లేదు. సినిమా మొత్తంలో ఏదీ బాలేదు. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా వహ్ అనిపించేలా లేదు.
బిజిఎమ్ ఏ మాత్రం సీన్లని ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయింది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ కరెక్ట్ గా చేస్తే సినిమా నలభై నిమిషాలు దాటదు. ఇక హారర్ జానర్ లో విఎఫ్ఎక్స్ ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అందరికి తెలిసిందే.. అది పూర్తిగా విఫలమైంది. ఇక పేలవమైన నిర్మాణ విలువలు సినిమాని మరింత పేలవంగా మార్చాయి.
నటీనటుల పనితీరు:
యోగి పాత్రలో యోగిబాబు, అమీ పాత్రలో ఓవియా ఒదిగిపోయారు. ఇక మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా..
తలనొప్పి కావాలంటే బూమర్ అంకుల్ చూడాల్సిందే. బెటర్ డోంట్ వాచ్ ఇట్.
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |