![]() |
![]() |

చిరంజీవి(chiranjeevi)హీరోగా 1979 లో వచ్చిన మూవీ పునాది రాళ్లు ద్వారా తెలుగు సినీ ఆరంగ్రేటం చేసిన నటుడు ప్రసాద్ బాబు(prasad babu)మనవూరి పాండవులు, బొబ్బిలి పులి, కాళీ, ఇన్స్పెక్టర్ ప్రతాప్, రుద్రవీణ, సోగ్గాడి పెళ్ళాం, అశ్వమేధం, అసాధ్యులు ,మురారి,దేశం కోసం భగత్ సింగ్, గ్యాంగ్ లీడర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. చేసిన అన్ని పాత్రలోను అద్భుతంగా నటించి అశేష ప్రేక్షాభిమానాన్ని పొందాడు. ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించాడు. ఆ లిస్ట్ కూడా కలుపుకొని మొత్తం పదిహేను వందల చిత్రాల దాకా ఉంటాయి. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు అవి వైరల్ గా నిలిచాయి.
ప్రసాద్ బాబు మాట్లాడుతు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు తప్పకుండా ఆయన ఎలక్షన్స్ లో గెలిచి సీఎం అవుతాడని అనుకున్నాను. కానీ నా కోరిక నెరవేరలేదు. కానీ ఒక రోజున మాత్రం ఖచ్చితంగా తీరుతుంది. ప్రస్తుతం ఏ పి డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్(pawan kalyan)రాబోయే రోజుల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నా కోరిక నెరవేరుస్తాడు. నిజానికి పవన్ రాజకీయాల్లోకి వస్తాడని అసలు అనుకోలేదు.ఎందుకంటే పవన్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. ఎప్పుడు పుస్తకాలు చదువుతు ఉండే వాడు. దాంతో రామకృష్ణ పరమ హంస, యోగి వేమన లాగా అవుతాడేమో అనుకునేవాడినని, దేశ సేవకి నడుం బిగిస్తాడని అనుకోలేదని చెప్పుకొచ్చాడు. అదే విధంగా పవన్ లాంటి నాయకులే ఈ దేశానికి కావాలని కూడా చెప్పాడు.
.webp)
ఇక పవన్, చిరు ల అనుబంధం గురించి కూడా కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసాడు. రామాయణంలో రాముడి కాళ్ళకి లక్ష్మణుడు దణ్ణం పెట్టాడో లేదో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చిరంజీవి కాళ్ళకి దణ్ణం పెట్టిన తర్వాత లక్ష్మణుడు కూడా రాముడి కాళ్ళకి దణ్ణం పెట్టాడని అనుకోవచ్చు. అలాగే ఆ సంఘటన ద్వారా నీకు జరిగిన అవమానానికి అతన్ని పీకి పడేశానని చిరుకి పవన్ చెప్పినట్టు కూడా అయ్యింది. ఆ అవమానం ఏంటో, ఆ వ్యక్తి ఎవరో అందరకి తెలుసనీ కూడా చెప్పాడు.
![]() |
![]() |